బిగ్ బాస్ విన్నర్ కి పోలీసుల షాక్.. అసలు ఏం జరిగిందంటే..?

-

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు సోమవారం రైతుబిడ్డపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. పోలీసులు పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేసారు. 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇక నిన్న రాత్రి బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని అనౌన్స్ చేసిన తరువాత బస్సులు కంటెస్టెంట్ల వాహనాలపై ఆయన అభిమానులు దాడి చేసిన విషయం తెలిసిందే.

తాజాగా బిగ్ బాస్ గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు, ప్రభుత్వ ప్రయివేటు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆరు బస్సులు.. ఓ పోలీస్ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలను ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version