ఇండియాలో నిషేధించిన కుక్క జాతులు ఇవే.. ఎందుకో తెలుసా..?

-

కుక్కలను మనిషికి మంచి స్నేహితులుగా పిలుస్తారు. కుక్కలను పెంచుకోవడం ఈరోజుల్లో చాలామందికి అలవాటుగా మారింది. ఒక్కసారి కుక్క మిమ్మల్ని నమ్మింది అంటే.. అది మీకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది. మిమ్మల్ని మీకంటే ఎక్కువగా అర్థం చేసుకుంటుంది. సంతోషాన్ని రెట్టింపుచేస్తుంది, బాధలో ఓదార్పు ఇస్తుంది. మీకు మంచి టైమ్‌పాస్‌ అవుతుంది. ఈ భావాలన్ని జంతుప్రేమికులకు మాత్రమే అర్థం అవుతాయి. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కుక్కకాటుకు గురైన ఘటనలు కుక్క ప్రేమికులను, అధికారులను కలవరపెడుతున్నాయి. భారతదేశంలో కొన్ని కుక్క జాతులను నిషేధించారు. అవేంటో తెలుసా..?

బుల్ డాగ్: ఇది బ్రిటన్‌లో నివసించే కుక్క జాతి. దీని బరువు 18-25 కిలోలు ఉంటుంది.. ఇది భారతదేశంలోనే కాకుండా మరికొన్ని దేశాల్లో కూడా నిషేధించబడింది. నార్వే మరియు నెదర్లాండ్స్‌లో కూడా ఈ కుక్కలను పెంచడం చట్టవిరుద్ధం.

రోట్‌వీలర్: ఈ కుక్కలను జర్మన్ పశువులను మేపడం మరియు మాంసాన్ని లోడ్ చేసిన బండ్లను మార్కెట్‌కి లాగడం వంటి పనులకు ఉపయోగిస్తారు. దీని బరువు 50 నుండి 60 కిలోల వరకు ఉంటుంది.

పిట్ బుల్: చాలా దేశాల్లో దీనిని అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్ అంటారు. ఇది భారతదేశంలోనే కాకుండా ఇంగ్లాండ్‌లో కూడా నిషేధించబడింది. ఇది మనిషిని సులభంగా పీక్కుని తినేయగలదు. ఏటా దీని బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క 2021లోనే పిట్‌బుల్‌ కుక్కలు 441 మంది అమెరికన్స్‌ను చంపాయి. యూస్‌ ఆర్మీ ఈ కుక్కలను మిలటరీ నుంచి కూడా బాన్‌ చేసింది.

నియాపోలిటన్ మాస్టిఫ్: ఇది ఇటలీకి చెందిన సాంప్రదాయ కాపలా కుక్క జాతి. దీని బరువు 50-70 కిలోలు. భారత్‌తో సహా 12 దేశాల్లో దీన్ని నిషేధించారు.

టెర్రియర్: ఈ రకమైన కుక్కను కీటకాలను వేటాడేందుకు పెంచుతారు. ఈ వర్గంలో అనేక జాతులు ఉన్నాయి. ఇది 1 కిలోల నుండి 60 కిలోల వరకు ఉంటుంది. ఈ కుక్క జాతులను వాటి క్రూరమైన నేచర్‌ కారణంగా ఇండియాలో బాన్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version