మందుబాబులకు చేదువార్త.. రాష్ట్రంలో బీర్ల ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. దీని ప్రకారం అన్ని బ్రాండ్లపై ఒక్క బీరు ధర రూ.10 నుంచి 20 రూపాయల వరకు పెరగనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్ బీట్ బీర్ ధర.140 రూపాయలు ఉండగా అది 150కి పెరగనుంది. స్ట్రాంగ్ బీరు ధర 150 ఉండగా.. 160 కి పెరగనున్నట్లు సమాచారం.
దీంతో పెరిగిన ధరలతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తుంటే.. పెరగబోయే బీర్ల ధరలు మరో మంట పుట్టించేలా ఉన్నాయి. గతేడాది మే నెలతో పోల్చితే ఈ వేసవి సీజన్లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.బీర్ల అమ్మకాలలో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది.1.15 కోట్ల లీటర్ల బీరు విక్రయం తో వరంగల్ సెకండ్ ప్లేస్ లో ఉంది.