అతడు సినిమా స్టైల్‌లో తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకున్నాడు బీజేపీ నేత భాస్కర్ గౌడ్. తన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు భాస్కర్ గౌడ్. దింతో కేసు నమోదు చేసుకొని విచారించిన ఉప్పల్ పోలీసులు…భాస్కర్ గౌడ్ నిందితుడని విచారణలో తేలడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని రిమాండ్కు తరలించారు.
భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను సినీ నిర్మాతగాను, బిజెపి హిందూ ప్రచార కమిటీ గాను వ్యవహరిస్తున్నారని ఈ సందర్బంగా డిసిపి పద్మజ తెలిపారు.సమాజంలో పలుకుబడి పెంచుకోవడం ఈ మర్డర్ ప్లాన్ చేయించుకున్న భాస్కర్…తనకు గన్మెన్లు వెంట ఉంటే సమాజం నన్ను గౌరవిస్తుందని దురుద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేసాడని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్ లో ఈ మర్డర్ అటెంప్ట్ ప్లాన్ జరిగింది. ఈ మర్డర్ అటెంప్ట్ ప్లాన్ కోసం 2,50,000 ఒప్పందం భాస్కర్ గౌడ్ కుదుర్చుకున్నట్లు డిసిపి పద్మజ తెలిపారు.భాస్కర్ గౌడ్ పై జంటనగరాల్లోని పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదు చేశామన్నారు. వీరి వద్ద నుండి ఇన్నోవా వాహనం,రెండు ద్విచక్ర వాహనాలు, 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాడు పోలీసులు.భాస్కర్ గౌడ్ తో పాటు ఈ మర్డర్ ప్లాన్ కోసం సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని ఇంకో ఇద్దరు పరార్లో ఉన్నట్లు తెలిపారు మల్కాజిగిరి డిసిపి పద్మజ.