గెలుపు గుర్రాల వేటలో బీజేపీ.. !

-

భాగ్యనగరంలో ఎన్నికల హడావిడి మొదలైంది. కమలదళం గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. ఈరోజు తొలి జాబితాను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇదిలా ఉంటే పార్టీలో ఇప్పటికే ఫిరాయింపులు మేళ మొదలైంది. తెరాస, కాంగ్రెస్ లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు భాజపా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆశావహుల జాబితాను సేకరించారు. ఫిల్టరింగ్ కూడా చేసేశారు. గ్రేటర్‌ ఎన్నికల ఇంచార్జి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన రాగానే ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తొలి జాబితాను ఖరారు చేయాలని భాజపా నిర్ణయించింది.

24 అసెంబ్లీ స్థానాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల్ని సమన్వయకర్తలుగా నియమించింది. మేనిఫెస్టో కమిటీకి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ప్రచార కమిటీకి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బహిరంగ సభలకు బంగారు శృతి, ఫైనాన్స్‌ అకౌంట్స్‌ కమిటీకి వివేక్‌ వెంకటస్వామి, ఎన్నికల సంఘం, న్యాయపరమైన అంశాలకు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మీడియా కమిటీకి ధర్మపురి అర్వింద్‌ను ఇంచార్జిగా నియమించింది. ఏపీకి చెందిన ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఇంచార్జిగా మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, సహ ఇంచార్జిలుగా సీఎం రమేశ్‌, డాక్టర్‌ పద్మ, సుమంతిరెడ్డి, సుహాసినిరెడ్డి, డాక్టర్‌ నిర్మలాదేవిని నియమించింది.

నాంపల్లి-సోయం బాపురావు, శేరిలింగంపల్లి- ధర్మపురి అర్వింద్‌, మల్కాజిగిరి- ఎం.రఘునందన్‌రావు, ఎల్‌బీనగర్‌- సంకినేని వెంకటేశ్వరరావు, మహేశ్వరం-యన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్‌-వన్నాల శ్రీరాములు, ఉప్పల్‌-ఎం.ధర్మారావు, కుత్బుల్లాపూర్‌- చాడా సురేష్‌రెడ్డి, కూకట్‌పల్లి- పెద్దిరెడ్డి, పటాన్‌చెరు- పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అంబర్‌పేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ముషీరాబాద్‌- జితేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌- విజయరామారావు, యాకుత్‌పుర- రామకృష్ణారెడ్డి, బహదూర్‌పుర-సుద్దాల దేవయ్యలు, కంటోన్మెంట్‌- శశిధర్‌రెడ్డి, సనత్‌నగర్‌- మోత్కుపల్లి నర్సింలు, జూబ్లీహిల్స్‌- చంద్రశేఖర్‌, ఖైరతాబాద్‌- మృత్యుంజయం, చార్మినార్‌- కాశీపేట లింగయ్య, గోషామహల్‌-యండల లక్ష్మీనారాయణ, కార్వాన్‌-బొడిగ శోభ, మలక్‌పేట-విజయపాల్‌రెడ్డి నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news