సొంత పార్టీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చిన అభయ్ పాటిల్..!

-

నన్నెవరు ఏం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు ఉండకండి. నేను వాళ్ల శిష్యుడిని.. వీళ్ల శిష్యుడిని అని కబుర్లు చెప్పొద్దు. మనమంతా పార్టీ, మోడీ శిష్యులమే అని అన్నారు బీజేపీ ఇన్చార్జి అభయ్ పాటిల్. సికింద్రబాద్ పార్లమెంట్ బీజేపీ మీటింగ్ లో అభయ్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేసారు.. ఇది మాట్లాడుకునే సమయం కాదు.. పార్టీ సభ్యత్వాలను పెంచుకునే సమయం. ఇక్కడ కూర్చుని కోల్గెట్ అడ్వర్టైజ్ లో చేసినట్లుగా కబుర్లు పెట్టొద్దు. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పండి లేదా స్టేజీపై ఉన్న వారికి చెప్పండి. కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరికీ సభ్యత్వ టార్గెట్ పెట్టాం. నేను ఐదుసార్లు ఎమ్మెల్యేను.. ఆరు సార్లు ఎమ్మెల్యేను నేను సభ్యత్వాలు నమోదు చేయాలా? అనే కబుర్లు చెప్పొద్దు. ఎవరు ఎంత మంది సభ్యత్వాలు చేశారు అన్నది నాకు ముఖ్యం.

వచ్చే పది రోజుల్లో మళ్లీ వస్తాను.. అప్పటికీ మీకు ఇచ్చిన టార్గెట్ లో 50 శాతం పూర్తిచేయకుంటే మీ పదవులు పోతాయ్. పార్టీ పదవి ఇచ్చిందంటే పార్టీకి పనిచేయాలి. అంతేకాని విజిటింగ్ కార్డుల్లో పార్టీ పదవి ప్రింట్ చేసుకుని పైరవీలు చేస్తూ తిరగొద్దు. నేను మీ చప్పట్ల కోసం రాలేదు.. సభ్యత్వ నమోదు కోసం వచ్చాను. ప్రతి జోన్ లో తమకు ఇచ్చిన టార్గెట్ కంటే ఒక సభ్యత్వం ఎక్కువగానే చేయాలి. ఈ పది రోజులు ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున పార్టీకి పనిచేస్తే టార్గెట్ ను రీచ్ అవ్వొచ్చు అని అభయ్ పాటిల్ పార్టీ నేతలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news