BRS పార్టీలో చేరిన బీజేపీ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి

-

 

తెలంగాణ బీజేపీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీజేపీ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీజేపీ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి.

BJP leader Gattu Srikanth Reddy joined BRS party

ఈ సందర్భంగా కండువా కప్పి బీజేపీ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్‌. ఇక అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండడంపై మంత్రి కేటీఆర్ కీలక వాక్యాలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే టిడిపి ఇక్కడ పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లోను ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ వైషమ్యాలు, విభేదాలు తెలంగాణకు పాకోద్దు. నిరసన తెలిపేందుకు ధర్నాచౌక్ ఉంది. ఇష్ట రీతిన వ్యవహరిస్తామంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిచ్చు పెట్టొద్దు’ అని తెలిపారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version