BRSను మెర్జ్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు..!

-

రుణమాఫీ పై రైతాంగాన్ని రేవంత్ రెడ్డి మోసం చేశారు. ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారు. 2 లక్షల రుణమాఫీ 17 వేల కోట్లతో ఎలా సాధ్యం అయ్యింది. రుణమాఫీ జరగక పోవడంతో రైతులు బాధ పడుతున్నారు అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి మోసపూరిత కండిషన్స్ పెట్టారు.. రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా రేషన్ కార్డు కి లింక్ పెట్టారు. రుణమాఫీ నుండి డైవర్ట్ చేయడానికి బీజేపీ, BRS విలీనం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.

అలాగే దొంగచాటుగా గా బీజేపీ ఎప్పుడు మాట్లాడుకోదు. BRS ను మెర్జ్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీ కి లేదు. ముందుగా ఇచ్చిన హామీలు నేరవేర్చండి… అందరికీ రుణమాఫీ చేయండి. రైతులందరికీ రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా… శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా… మీరు సిద్దమా అని సవాల్ చేస్తున్న.. ఇంకా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు… ఎగ్గొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version