వేములవాడ రాజన్న ఆలయం ముందు బీజేపీ నాయకులు నిరసన చేస్తున్నారు. రాజన్న కోడేల తరలింపు వ్యవహారంపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మంత్రి సిఫారసు ద్వారానే మంత్రి అనుచరుడు రాంబాబు 66 కోడెలను తీసుకెళ్లారు. ఇందులోని 28 కోడేలు వదశాలకు అమ్మారు. వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు కోడెల అక్రమాలను తేల్చి మంత్రి అనుచరుడు రాంబాబు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
దీంతో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ లీడర్లు.. సాక్షాత్తు రాజన్న కోడెలను మంత్రి సిఫారసు ద్వారా తీసుకెళ్లి అమ్ముకున్న వైనంపై పూర్తిస్థాయి విచారణ జరిపి రాజన్న ఆలయ ఈవో, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రాజన్న కోడెలను అక్రమంగా అప్పగించిన వ్యవహారంలో మంత్రిని బర్తరఫ్ చేయాలని.. మంత్రి కొండ సురేఖ కూడా రాజన్నకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు.