కోమటిరెడ్డి సహా 5 మంది కాంగ్రెస్ మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారు – మహేశ్వర్ రెడ్డి

-

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా 5 మంది కాంగ్రెస్ మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బాంబ్‌ పేల్చారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యేలను కొంటే… 48 గంటల్లోనే రేవంత్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. ఓటు కు నోటో ఇంకో అంశమో తన సీటు కు ప్రమాదం వస్తుందనే భయం తో రేవంత్ రెడ్డి కి నిద్రపట్టడం లేదు….పది మంది మంత్రులు సీఎం సీటుపై కన్నేశారని చురకలు అంటించారు.

BJP MLA Eleti Maheshwar Reddy

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…నీ తమ్ముడే నీతో టచ్ లో లేడు అట….ఆయన భార్యకు టికెట్ రాకుండా మీరే అడ్డుకున్నారు అట అంటూ సెటైర్లు పేల్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే 48 గంటలోనే ప్రభుత్వం కూలిపోతుంది బిడ్డా అని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ లు మారితే రాళ్ళతో కొట్టాలని అన్నావు… ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నావు… ఇప్పుడు దేనితో కొట్టాలని ఆగ్రహించారు. రంజిత్ రెడ్డిని విమర్శించి… ఇప్పుడు ఆయనకి ఎలా టికెట్ ఇచ్చావు అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్‌ వసూళ్ల చిట్ట మా దగ్గర ఉంది.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news