సాధారణంగా ఒక ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా జరుగుతుందంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ఆధారంగా శిలాఫలకాన్ని తయారు చేస్తుంటారు. ఆ శిలా ఫలకాల్లో కొంత మంది పేర్లు మిస్ అవుతుంటాయి. కొంత మంది కావాలని మిస్ చేస్తే.. మరికొందరూ మాత్రం చిన్న చిన్న పొరపాట్ల కారణంగా శిలాఫలకం పై పేర్లు మిస్ అవుతుంటాయి.
తాజాగా నారాయణపేట జిల్లాలో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ లో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. నర్వ ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యక్రమంలో శనివారం ఈ రగడ జరిగింది. శిలా ఫలకం లో బీజేపీ ఎమ్మెల్యే ఏవీఎన్ రెడ్డి పేరు లేకపోవడంతో స్థానిక ఎంపీ డీ.కే.అరుణ సీరియస్ అయ్యారు. ఈ విషయం ఎమ్మెల్యే శ్రీహరిని ఎంపీ డీ.కే.అరుణ నిలదీశారు. దీంతో పరస్పరం బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదురగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.