ఎన్నికలు రాగానే కాంగ్రెస్ కు గల్ఫ్ బోర్డు గుర్తొచ్చిందా : ఎంపీ అర్వింద్

-

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఇన్నాళ్లు గల్ఫ్ కార్మికులు గుర్తు రాలేదా? అని నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ కుమార్ ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నాయని గల్ఫ్ బోర్డు మాట ఎత్తుకున్నారా? అని నిలదీశారు. గల్ఫ్ బోర్డు అంశం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఎందుకు పెట్టలేదని అడిగారు. గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరచుకుపడ్డారు.

“ఏడాది దోపిడీ ఆపితే రుణమాఫీ సాధ్యమని రేవంత్‌ చెప్పడం సిగ్గుచేటు. 40 వేల కోట్లు వసూలు అవుతాయంటూ ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం ఆయన అవినీతికి నిదర్శనx. గల్ఫ్ కార్మికులతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. గల్ఫ్ బోర్డు తెరపైకి రావడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్. ఎన్నికలు రాగానే గల్ఫ్ కార్మికులు గుర్తొచ్చారా గడిచిన 6 నెలల్లోనే రేవంత్ 20 వేల కోట్లు సంపాదించినట్టా? ” అని అర్వింద్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news