సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల తాకిడి ఎక్కువ అవ్వటం వలన రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్లపల్లి లో గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని, ఈ ప్రాంతాన్ని ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 500 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేశారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
వారం రోజుల పాటు మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్షించి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నము. అలాగే డిసెంబర్ 28వ తేదీ నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నా సందర్భంగా ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.