ఇది భూభారతి కాదు.. భూ హారతి : ఎమ్మెల్సీ కవిత

-

ప్రపంచ వ్యాప్తంగా భూమి అనేది ఒక ఎమోషన్. భూమి కోసం ప్రాణము ఇచ్చేవారు ఇద్దరు ఒకరు సైనికుడు, ఒకరు రైతు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ లో 1942 లో మా భూమి మాకు కావాలని కొట్లాడారు. రైతులకు తమ భూమి గురించి సంపూర్ణ హక్కులు పూర్తి వివరాలు తెలుసుకునెలా ధరణి పోర్టల్ తెచ్చారు. ఎదో ఒక వ్యక్తి మీద, పార్టీ మీద కోపంతో కాకుండా ప్రజలకు ఏది మంచిదో ఆలోచిస్తే బాగుంటుంది. భూ భారతి చట్టం తేవడం రాష్ట్రం తిరోగమన చర్యలా ఉంది. కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మార్క్ ఉండాలని ధరణి చట్టం తేలేదు రైతు తన గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయేలా ధరణి తెచ్చారు. అలాంటి ధరణితో ఆటలాడుతున్నారు చరిత్ర మిముల్ని క్షమించదు. మళ్ళీ రైతులు ధరణి కావాలని తిరగబడే రోజులు వస్తాయి.

ఎంజాయ్మెంట్ సర్వే అంటున్నారు ఇప్పటికే రైతులు బేజారు అయితున్నారు. పచ్చగా ఉన్న రైతుల జీవితాలతో ఎందుకు అడ్డుకుంటున్నారు. ధరణిలో పార్ట్ ఏ లో కొన్ని భూములు, పార్ట్ బి లో కొన్ని భూములు రూపొందించారూ. భూదార్ అంటున్నారు, పాస్ బుక్ టా0పర్ కాకుండా చేసాము. ఖాతా నంబర్ ఉండగా మళ్ళీ భూదార్ ఎందుకు. కాంగ్రెస్ పార్టీ అధికారములోకి వచ్చి ఏడాది అవుతుంది ఇంకా అబద్ధాలు ఎందుకు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పండి. సాదాబైనామాలు, అబాదిలు, గ్రామ కంఠం భూముల పై మీద క్లారిటీ లేదు ఎదో కుట్ర కోణం ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజలు వెంటపడి ఈ చట్టాన్ని తొలగించుకుంటారు. ఇది భూభారతి కాదు.. భూ హారతి. బీఆర్ఎస్ అంటే భూ రక్షణ సమితి అని రైతులు మాకు కితాబిచ్చారు అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news