బిజెపి – టిఆర్ఎస్ పార్టీలు చెండాలమైన రాజకీయం చేస్తున్నాయి – ఎమ్మెల్యే జగ్గారెడ్డి

-

బిజెపి – టిఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బిజెపి, టిఆర్ఎస్ తిట్టుకుంటూ, కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలకు సొంత పంచాయతీలో ఎక్కువగా అయిపోయాయని మండిపడ్డారు.

jaggareddy | జగ్గారెడ్డి

ఈ రెండు పార్టీల పంచాయితీలు చూస్తే చాలు.. ఇక సినిమాలు కూడా చూడనవసరం లేదని ఎద్దేవా చేశారు. కవిత, అరవింద్ లు రైతుల కోసం కొట్లాడుతున్నారా? విద్యార్థుల కోసం కొట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత దుకాణాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు మీడియాని ఎలా అట్రాక్ట్ చేయాలి, మీడియాని డైవర్ట్ ఎలా చేయాలి అనే పనిలో ఉన్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా చేయాలని ఇద్దరూ ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు చండాలమైన రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు పార్టీకి నష్టమని పేర్కొన్నారు. అలాంటి వాళ్లు పార్టీని వదిలేస్తే చాలా నష్టపోతామన్నారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క బాధ్యత వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version