బిజెపి – టిఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువైంది – పొన్నం ప్రభాకర్

-

బిజెపి – టిఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.. వాస్తవంగా సింగరేణిలో ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉంటుందన్నారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు పొన్నం.

తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. AMR కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని అన్నారు. ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందని.. వేలకోట్ల కుంభకోణం జరిగిందన్నారు. 49 శాతం వాటా ఉన్న కేంద్రం ఎందుకు మోనంగా ఉంటోందని ప్రశ్నించారు.

ఈ అంశంపై సీబీఐ, ఈడీకి, బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తున్నానన్నారు. 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే చెప్పారని.. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ బొగ్గు గనుల కేటాయింపు పై దర్యాప్తు సంస్థలతో విచారణకు అదేశించాలన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వద్దన్న వాళ్లు ఇప్పుడు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news