ఈనెల 15 లేదా 16న బీజేపీ తొలి జాబితా..?

-

తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఎవ్వరికీ వారు ప్రచారం చేస్తూ హుషారుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే 70 మంది ఖరారు చేసిందని.. మరో 30 మంది అసెంబ్లీ అభ్యర్థుల కోసం పరిశీలన జరుపుతుంది. జనసేన, బీఎస్పీ కొంత మంది అభ్యర్థులను ప్రకటించాయి. 

బీజేపీ కూడా 40 మందితో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపించింది. పెత్తర అమవాస్య తరువాత  ఈనెల 15 లేదా 16న 38 మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఏకాభిప్రాయం రాని మిగతా స్థానాల అభ్యర్థులు ఎంపికకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. మొత్తం3 జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ కి ముందే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారం పూర్తి చేయాలని భావించిన కమలం పార్టీ 3 రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీని రెండుసార్లు రాష్ట్రానికి రప్పించింది.

పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మోడీ నిజామాబాద్ గడ్డ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈనెల 10న ఆదిలాబాద్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఆదిలాబాద్ జనగర్జన సభ పేరుతో నిర్వహించే సభలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ సభ తరువాత.. సాయంత్రం రాజేంద్రనగర్ లో నిర్వహించే సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version