ఎంపీ వెంకటేష్ నేత నాకు అన్యాయం చేశాడు – బోడపాటి శేజల్

-

ఎంపీ వెంకటేష్ నేత నాకు అన్యాయం చేశాడని బోడపాటి శేజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేసిన బోడపాటి శేజల్..ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఒక మహిళకు న్యాయం చేయకుండా క్రిమినల్స్ కు అండగా ఉండి కాపాడిన వాళ్లకు ఎంపీ సీటు కేటాయించవద్దని కోరింది.

Bodapati Sejal comments on venkatesh netha

కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు కేటాయిస్తే ఖచ్ఛితంగా ఓటమి తప్పదని ఆరిజన్ డైరీ డైరెక్టర్ బోడపాటి శేజల్ జోస్యం చెప్పింది. ఇది ఇలా ఉండగా..నిన్న కాంగ్రెస్ చేరారు వెంకటేష్. బీజేపీతో అంతర్గతంగా బీఆర్ఎస్‌ పార్టీ ఒప్పందం పెట్టుకుందని ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపించారు.

ఈ రెండు పార్టీల పొత్తు సహించలేకనే గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు. ఇటీవలే ఆయన దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత ఆకస్మిక రాజీనామా ఓ రకంగా బీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చిందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version