BRS పార్టీకి మరో షాక్..కాంగ్రెస్‌లో చేరనున్న బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్

-

BRS పార్టీకి మరో షాక్.. ఎన్నికల నేపథ్యంలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ బోధన్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్ పర్సన్ పద్మశరత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమెతో పాటు పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా హస్తం పార్టీలో చేరేందుకు హైదరాబాదులోని గాంధీభవన్ కు బయలుదేరారు. అయితే, ర్యాలీ గా వెళితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించిన పోలీసులు….కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

Bodhan Municipal Chairperson to join Congress

కాగా, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్న వరంగల్లో ఆయనతో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా అందుకు రేవూరి అంగీకరించారు. ఢిల్లీలో ఆయన హస్తం కండువా కప్పుకొనున్నారు. ఎన్నికల్లో పరకాల నుంచి పోటీచేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version