బీఆర్‌ఎస్‌ పార్టీకి బొంతు రామ్మోహన్ రాజీనామా…క్లారిటీ ఇదే !

-

బీఆర్‌ఎస్‌ పార్టీకి హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రాజీనామా చేసినట్లు వార్తలు మొన్నటి నుంచి వైరల్‌ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్…క్లారిటీ ఇచ్చేశారు. మల్కాజ్ గిరి (లేదా) సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నానని వివరించారు. ఇదే విషయం పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు.

Bontu Rammohan Post Viral

ఒకే కుటుంబం వారికి అవకాశం ఇవ్వకుండా ఉద్యమకారులకు, పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించానని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. తాను హైదరాబాద్ మేయర్ గా నగర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేశానని పేర్కొన్నారు.

పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ ఇతర పెద్దల పై నాకు విశ్వాసం ఉంది. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారనే నమ్మకం ఉంది. నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానల్స్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదన్నారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.

Read more RELATED
Recommended to you

Latest news