సింగరేణి ఎన్నికలను బహిష్కరించండి.. మావోల లేఖ సంచలనం..!

-

సింగరేణి ఎన్నికలను బహిష్కరించాలంటూ కార్మికులకు పిలుపునిస్తూ మావోయిస్టుల విడుదల చేసిన లేఖ సంచలనం రేపుతుంది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతించిన అనంతరం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమఖ్య కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. సింగరేణి ఎన్నికలను బహిష్కరించాలని లేదంటే TBGKS నాయకులకు శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు.


పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలి. కార్మిక సంఘాలు కార్మికుల కోసం ఒరగబెట్టింది ఏమీ లేదు. సింగరేణి సంస్థను ఆర్థిక దోపిడీకి గురి చేశారు. కొత్త గనులు తవ్వకుండా ఓపెన్ కాస్టులకు, ఓబీ నుంచి బొగ్గు ఉత్పత్తి వరకు ప్రైవేటీకరణకే ప్రాధాన్యత ఇచ్చారు. మెడికల్ బోర్డు అవినీతిలో ఒక్కో కార్మికుడి దగ్గర నుంచి రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు వసూళ్లు చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా నేతల తీరు మారడం లేదు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోకపోతే TBGKS నాయకులకు శిక్ష తప్పదు అని లేఖలో హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version