నిరుద్యోగులకు అలర్ట్..1523 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బ్రేక్!

-

 

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌. ప్రభుత్వ స్కూళ్లలో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించగా… నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. తొలిసారి ఆ పోస్టులు భర్తీ చేయనుండటంతో… వాటికి సర్వీస్ రూల్స్ తయారు చేసే పనిలో పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

దీంతో పోస్టుల భర్తీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. స్కూళ్లలో మానసిక వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకోసం ఈ స్పెషల్ టీచర్లను నియమించనున్నారు. కాగా, ఈనెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఉత్సవాలను నిర్వహించనున్నారు. జనగామ, నిర్మల్‌, కామారెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, ఖమ్మం జిల్లా ల్లో ఈనెల 15న కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ఘనంగా వైద్య ఉత్సవాలను నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. కనీసం 15 వేల నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ప్రదర్శనలను చేపట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news