BREAKING: సూర్యాపేట 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనలో టిఆర్ఎస్ నేత కొడుకు అరెస్ట్?

-

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు స్థానిక టిఆర్ఎస్ నేత కొడుకుతో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడిని టిఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు షేక్ గౌస్ గా గుర్తించి..మరో నిందితుడు సాయి రామ్ ను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..20 ఏళ్ల యువతిని ఆటో లో కిడ్నాప్ చేసి..ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు నిందితులు.ఏప్రిల్ 17న ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత తన తల్లికి జరిగిన సంఘటనను తెలియజేసింది.బాలిక తల్లి కోదాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు.నిందితులు స్థానిక టిఆర్ఎస్ నేత వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ ఖాజా కొడుకు షేక్ గౌస్ పాషా, మరో నిందితుడు సాయిరాం రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది.విచారణలో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లు, కాల్ డేటా ద్వారా విచారణ చేపడుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news