అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్ ఇవాళ ప్రకటించి వారికి బీఫాంలు అందజేస్తారని తెలుస్తోంది.
జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి, నరసాపూర్ నుంచి సునితా లక్ష్మారెడ్డికి, గోషామహల్ నుంచి నంద కిషోర్ వ్యాస్ బిలాల్ కు, నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్ కు కేసిఆర్ బీఫాంలు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, హైట్రిక్ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న సీఎం కేసీఆర్… ఇవాల్టి మేనిఫెస్టోలో కీలక హామీలను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైతుబంధు సాయం కింద ఏడాదికి 16,000 ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. యాసంగి మరియు వానాకాలం సీజన్లలో ఒక్కో సీజన్కు ఎనిమిది వేల రూపాయల చొప్పున ఇస్తారని ప్రచారం సాగుతోంది. కాగా తాము రైతుబంధు కింద ఏటా 15000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఈ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.