KCR : బర్త్‌ డేకు ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్!

-

తుంటి ఎముకకు సర్జరీతో గతకొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారట. తన పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తారని సమాచారం. ఆ రోజే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు రానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గజ్వేల్ లో పార్టీ క్యాడర్ తో సమావేశం అవుతారట.

BRS chief KCR will come to Telangana Bhavan on February 17

మరోవైపు గులాబీ దశ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫిబ్రవరి 17 కేసీఆర్‌ పుట్టిన రోజు ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్‌కు రానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక ఫిబ్రవరి 20 తర్వాత నుంచి గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో రెగ్యులర్‌గా ప్రజలకు, క్యాడర్‌కు అందుబాటులో కేసీఆర్ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news