బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి తర్వాత అసెంబ్లీకి రాబోతున్నారు కేసీఆర్. బడ్జెట్ రోజున అసెంబ్లీకి రానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారట. ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు కూడా ఈ విషయాన్ని తెలిపారు.
ఇందులో భాగంగానే.. ఇవాళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు కేసీఆర్. కాగా, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా…. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీలో అసెంబ్లీ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.