తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలియక వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారంలో చేయాల్సినవన్ని చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశమొచ్చినా సరే.. దానిని సువర్ణావకాశంగా మలచుకొని అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలు ఎవ్వరివైపు ఉన్నారు.. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందా..? ఈ రెండింటినీ కాదని బీజేపీకి పగ్గాలిస్తారా..? అనేది తెలియడం లేదు. ఈసారి ప్రముఖ సర్వే సంస్థలకు సైతం అంతు చిక్కడం లేదు. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ దే అధికారం అని.. మరికొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని తెలుస్తోంది.
తాజాగా ‘జనతా కా మూడ్’ సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అని తేల్చి చెప్పింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే మూడోసారి అధికారమని వెల్లడించింది. ప్రధానంగా ఈ సర్వే ప్రకారం.. 41% ఓట్ షేర్‌తో 72 నుంచి 75 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాదించనుందని ‘జనతాకా మూడ్’ సంస్థ వారు నిర్వహించిన సర్వేలో వెల్లడి అయింది. ఈ సర్వే నిజమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 03 వరకు ఎదురుచూడాల్సిందే.