అరూరి, రాజయ్య లాంటి నేతలను కడియం శ్రీహరి తొక్కేసి..బయటకు పంపారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు పైన హన్మకొండ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు వినయ్ భాస్కర్ మాట్లాడుతూ…కడియం కావ్య పెట్టిన కామెంట్ చూసి నేను ఆశ్చర్యపోయామన్నారు. 31 తారీఖున చేపట్టే కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు కడియం శ్రీహరి ఇంటికి 8 గంటలకు నేను స్వయం వెళ్లాను అప్పుడు కూడా ఏలాంటి కామెంట్ చేయలేదన్నారు.
కడియం శ్రీహరి అహంకారంతో ఎంతోమందిని బలి పశులను చేశారని మండిపడ్డారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను నాయకులలో అణిచివేసిన చరిత్ర కడియం శ్రీహరిది అంటూ నిప్పులు చెరిగారు. విజయరామారావు,దొమ్మాటి సాంబయ్య, ఎంపీ దయాకర్, అరూరి రమేష్, రాజయ్యలను బయటకు వెళ్ళేలా చేశారని కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేసి పార్టీకి ద్రోహం చేశారు…. కడియం శ్రీహరి నిజాయితీపరుడు అయితే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.