BREAKING: బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గులాబీ పార్టీకి చెందిన కీలక నేత హత్యకు గురయ్యాడు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ ప్రధాన నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో టిఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురైనట్లు సమాచారం అందుతుంది.

ఈ శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. అయితే శ్రీధర్ రెడ్డి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news