ఎన్నికలు పూర్తికాగానే… రైతు బీమా, పంట బీమా చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ…. రైతు రుణమాఫీని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం లోపు పూర్తి చేస్తామని… ఎన్నికలు పూర్తవుగానే రైతుబంధును కూడా రైతులకు అందిస్తామని వెల్లడించారు.
వారం రోజులుగా వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు అందించే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది పది రోజుల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బును వేయడం జరుగుతుందని వివరించారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. రోజుకు 50 కోట్ల రూపాయలు అప్పు చేసి రైతులకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లో కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కానీ మన ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులకు ఈరోజు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.