కొడంగల్ పరిధిలో ఉన్న లగచర్ల గ్రామానికి వెళ్లనుంది బీఆర్ఎస్ నేతల బృందం. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న తరుణంలోనే.. లగచర్ల గ్రామానికి వెళ్లనుంది బీఆర్ఎస్ నేతల బృందం. కొడంగల్ లో ఇంటర్నెట్ బంద్ అయింది…రంగంలోకి 300 మంది పోలీసులు దిగారు. అర్ధరాత్రి లగచర్ల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో లగచర్ల గ్రామానికి 300 మందికి పైగా పోలీసులు…చేరుకున్నారట.
కలెక్టర్, అధికారులపై దాడి చేసిన 28 మందిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి, పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. అంతేకాదు… దుద్యాల, బొంరాస్ పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. అయితే.. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వ తీరు అమానుషం …లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణం అని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు.