త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. త్వరలోనే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే శుభవార్త వింటారు…మేనిఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చబోతున్నామని వెల్లడించారు. కోస్గి సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణలో గెలవనే గెలవరు… అన్ని మోసపు మాటలు….ఎవ్వరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన బిజెపి లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు. ముమ్మాటికీ మూడోసారి కేసీఆరే సీఎం అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు.
కొడంగల్ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయి. కొడంగల్‌కు ప్రస్తుతం కృష్ణా నుంచి తాగునీరు వస్తోంది, త్వరలోనే సాగునీరు వస్తుంది. 3 గంటలు విద్యుత్ చాలు అనే రేవంత్ రెడ్డి కావాలా… 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా? అని హరీశ్ రావు పేర్కొన్నారు. 12 లక్షల మంది ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎలాంటి పథకాలు ఉన్నాయో తెలుసుకోవాలని.. కర్ణాటకలో వృద్ధాప్య పింఛనుగా రూ.600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.