నేతలు పార్టీ వీడుతున్న వేళ.. త్వరలో బీఆర్‌ఎస్‌ కీలక భేటీ

-

కీలక నేతలు పార్టీని వీడుతుండటం.. త్వరలో పార్లమెంట్ సమావేశాలు.. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.. ఇతర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మూణ్నాలుగు రోజుల్లో ఈ కీలక భేటీ జరగనుంది. తెలంగాణ భవన్‌లో అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా సాగుతున్న భౌతిక దాడులు, ఐటీ, ఈడీ దాడులు, ఇతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, సహచర ఉద్యమకారులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ మాజీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ మాజీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంపై నేడో, రేపో అధికారిక సమాచారం వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news