నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

-

BRS MLA Arekapudi Gandhi likely to join Congress: గులాబీ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ… నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. నిన్న కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ చేరిపోయారు. ఇక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ… నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది.

BRS MLA Arekapudi Gandhi likely to join Congress

ఇది ఇలా ఉండగా, త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌ అన్నారు. ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కూడా దొరికేది కాదని వ్యాఖ్యానించారు. అపాయింట్‌మెంట్‌ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలోఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారన్న దానం నాగేందర్ విలువ లేనిచోట ఉండలేక కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news