ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఉట్టి బోగస్..BRS పోస్ట్‌ వైరల్‌

-

 

ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఉట్టి బోగస్! ఇదిగో సంచలన సాక్ష్యం అంటూ BRS పోస్ట్‌ వైరల్‌ గా మారింది. “ఢిల్లీ లిక్కర్ స్కామ్” పేరుతో బీజేపీ ఆడుతున్న రాజకీయ క్షుద్ర క్రీడ అంటూ ఫైర్‌ అయింది బీఆర్ఎస్‌. “2022లో నవంబర్ 11 నాడు అరబిందో ఫార్మా ప్రమోటర్, డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిని “ఢిల్లీ లిక్కర్ స్కామ్” కేసులో అరెస్ట్ చేసింది ఈడీ….శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన నాలుగు రోజులకు సదరు అరబిందో ఫార్మా బీజేపీ పార్టీకి రు. 5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇంత పెద్ద కేసులో నిందితుడి నుండి ఏ శషబిషలు లేకుండా బీజేపీ ఆ రూ.5 కోట్ల విరాళం గుటుక్కున మింగింది. మే 2023లో శరత్ చంద్రా రెడ్డి బెయిల్ పిటీషన్ కోర్టులో విచారణకు వస్తే చాలా విచిత్రంగా ఈడీ ఆ పిటీషన్‌ను వ్యతిరేకించలేదు. ఇలాంటి కేసుల్లో ఈడీ ఎన్నడూ బెయిల్ పిటీషన్ వ్యతిరేకించకుండా ఉండదు.” అంటూ పేర్కొంది బీఆర్‌ఎస్‌ పార్టీ.

జైల్ నుండి విడుదల అయిన శరత్ చంద్రా రెడ్డి జూన్ 2 నాడు ఇదే కేసులో అప్రూవర్‌గా మారుతాను అని ప్రకటించాడు. నవంబర్ 8, 2023 నాడు ఇదే అరబిందో ఫార్మా మరో భూరి విరాళం – రు. 25 కోట్ల రూపాయలు బీజేపీకి సమర్పించుకుంది. ఇదే తేదీన ఏపీఎల్ హెల్త్ కేర్ నుంచి రూ. 10 కోట్లు, యుజియ ఫార్మా నుండి ఇంకో రూ. 15 కోట్లు మొహమాటం లేకుండా బీజేపీ కళ్లుమూసుకుని రూ. 50 కోట్లు తీసుకుంది. మొత్తం రూ. 55 కోట్లు స్వాహా చేసిందని వెల్లడించింది బీఆర్‌ఎస్ పార్టీ.

 

Read more RELATED
Recommended to you

Latest news