చేవెళ్ల లో ఉప ఎన్నిక రాబోతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షాబాద్ రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. మీరు చేవెళ్ల లో కేసీఆర్ కు ఓటేశారు.. ఎమ్మెల్యే ని గెలిపించారని.. కానీ ఆయన అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళాడని ఆగ్రహించారు. ఎవరి అభివృద్ధి కోసం వెళ్ళాడో అందరికీ తెలుసు… చేవెళ్ల లోనే కాదు తెలంగాణ లో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు.
ఈ 2025 లోనే పార్టీ మారిన ఎమ్మెల్యే ల స్థానంలో ఉప ఎన్నికలు వస్తాయని… వాళ్ళను అందరిని ఓడించాలని కోరారు. రైతుల తరుపున ఇది ఆరంభం మాత్రమేనని… 21 వ తారీఖు న నల్గొండ లో మరో రైతు దీక్ష పెడతామని తెలిపారు కేటీఆర్. రైతుల ను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టొద్దు… ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరానని తెలిపారు. తెలంగాణ లో ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే మా ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తాం అని చెప్పాను… కానీ సీఎం మాట్లాడలేదని చురకలు అంటించారు.