వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BRS కు 90-95 సీట్లు ఇవ్వాలి : కేటీఆర్

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BRS కు 90-95 సీట్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ కేటీఆర్ సమక్షంలో ఖమ్మంకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.  ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక్క అవకాశం ఇవ్వాలి అంటున్నారు. ఇప్పటికే ప్రజలు 25 సార్లు అవకాశం ఇచ్చారు . అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కేంద్రంలో BRS లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కానీ పరిస్థితి వస్తుందని.. తెలంగాణ లో 17 ఎంపి స్థానాలు గెలిపించాలని తెలిపారు. 

కాంగ్రెస్ వచ్చేది లేదు…సచ్చెది లేదు …వాళ్లకు బాధ్యత లేదు అన్నారు. కానీ 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అంటారు. BRS 24 గంటలు కరెంట్ ఇస్తే…ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 25 గంటలు కరెంట్ ఇస్తామని అంటారు. కాంగ్రెస్ ను ఏమి చూసి ఆదరించాలి ? హనుమంతుని గుడి లేని ఊరు లేదు…కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు తెలంగాణలో లేదు అన్నారు. తెలంగాణ లో వానాకాలం లో కోటి ఎకరాల సాగు జరుగుతోంది. కేసీఅర్ హయాంలో తెలంగాణ కోటి ఎకరాల మాగణ అయ్యింది తెలంగాణ. ఛత్తీస్ గడ్ లో పొడు భూములకు పట్టాలు ఇచ్చారా ? అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది. కానీ ఆ పార్టీ నేతలు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. తెలంగాణ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ లో రైతు బంధు లేదు ,రైతు భీమా లేదు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version