3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. అమెరికా గడ్డపై KTR ప్రకటన

-

3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు అంటూ అమెరికా గడ్డపై KTR ప్రకటన చేశారు. అమెరికా డల్లాస్‌లో ఘనంగా ‌బీఆర్‌ఎస్‌ రజతోత్సవ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా KTR మాట్లాడారు. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉందని వెల్లడించారు కేటీఆర్.

BRS Silver Jubilee and Telangana State Formation Celebrations in Dallas, USA
BRS Silver Jubilee and Telangana State Formation Celebrations in Dallas, USA

2001 లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడని తెలిపారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడన్నారు. అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు అని స్పష్టం చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news