తెలంగాణలో హంగు కాదు BRS హైట్రిక్ కొడుతుందని బీఎల్ సంతోష్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. మంచిర్యాలలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చింది… 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు తాగు నీటి కోసం ఇబ్బంది పడ్డారు మహిళలు అంటూ పేర్కొన్నారు.
నడ్డా ఇది కేసీఆర్ అడ్డా…నీ రాష్ట్రంలోనే బిజెపిని గెలిపించుకోలేదు… ఇక్కడ ఎం సాగవు అంటూ ఫైర్ అయ్యారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకో నట కనీసం పరువు అయినా దక్కుతుంది…చేరికల కమిటీ అని ఏసుకున్న అది అట్టర్ ప్లాప్ అయిపోయిందని చురకలు అంటించారు. అలాగే.. బీ ఎల్ సంతోష్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హంగు కాదు బీ ఆర్ఎస్ హైట్రిక్ కొడుతుందన్నారు.