ఈనెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

-

ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉండనుంది. ఈ మేరకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12న కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించి…అక్కడి నుంచే పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగించనున్నారు కేసీఆర్‌. త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువబోతున్నదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.

KCR reached Telangana Bhavan

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న ఎస్సారార్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news