బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అమెరికాలోని డల్లాస్ నగరానికి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారత కాలమానం ప్రకారం రేపు (జూన్ 2) తెల్లవారుజామున డల్లాస్‌లోని డాక్టర్ పెప్పర్ అరీనాలో జరగనున్నాయి వేడుకలు.

ఇవాళ తన యూకే పర్యటన ముగించుకొని అమెరికాలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అమెరికాలోని డల్లాస్‌కు కేటీఆర్ బయలుదేరారు. మూడు రోజుల యూకే పర్యటనలో అనేకమంది ఎన్నారైలు కేటీఆర్ ని కలిశారు. ఫోటోలు తీసుకున్నారు. పార్టీకి, కేటీఆర్ నాయకత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. యూకే పర్యటన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విభాగం అద్భుతంగా పనిచేస్తుందని పార్టీ చేస్తున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
డాలస్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల్లో కూడా పాల్గొననున్న కేటీఆర్ pic.twitter.com/cu3WAhYOZi
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2025