విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…విద్యార్థుల శాంతియుత నిరసనపైన ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరించిందని ఆగ్రహించారు.
అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను నిరుద్యోగులను యువకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాగా, నిరుద్యోగుల చలో TGSPSC కి మద్దతు ప్రకటించి, బయల్దేరింది బీఆర్ఎస్వీ. ఈ తరుణంలోనే… BRSV స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విద్యార్థి నాయకులు, విద్యార్థులు. TGPSC ముట్టడికి నిరుద్యోగ జేఏసి పిలుపు నిచ్చింది.