ఆగస్టు 2 వరకు రేవంత్‌ కు డెడ్ లైన్..లేకపోతే 50 వేల మంది రైతులతో – కేటీఆర్‌

-

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు కేటీఆర్‌. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలని… లేదంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 50 వేల మంది రైతులతో వచ్చి మేమే పంపులు ఆన్ చేస్తామని డెడ్ లైన్ ఇచ్చారు కేటీఆర్‌.

BRS Working President KTR Warning to Revanth Reddy Govt

పంపులు ప్రారంభించండి… రాజకీయాలు మానండి అని కోరారు. పంపులు ప్రారంభిస్తారా లేదా… అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు గడువునిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించండి…ప్రభుత్వం స్పందించకపోతే మేమె వచ్చి పంప్ హౌజ్ లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. ఉద్దేశ్య పూర్వకంగా, నెరపూరిత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది..100 భాగాలు ఉన్న ప్రాజెక్ట్ లో చిన్న భాగంలో సమస్య వస్తే రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహించారు. పోలవరం కొట్టుకుపోతే ఇప్పటి వరకు NDSA రిపోర్ట్ ఇవ్వలేదని..కానీ కాళేశ్వరంలో మాత్రం ఒక్కరోజులో ఇచ్చారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news