కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) అందుబాటులోకి రావటంతో భవిష్యత్తులో ఉద్యోగాల్లో చాలా మార్పులు రానున్నట్లు ఇప్పటికే పలువురు టెక్ నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. ఏఐ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారని కూడా చెప్పారు. మరోవైపు ఏఐతో చాలా సమస్యలు, ముప్పు కూడా పొంచి ఉందని పేర్కొన్నాయి. అయితే తాజాగా లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏతరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి మరో చర్చకు తెరలేపారు.
టెక్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హాఫ్‌మన్ .. ప్రస్తుతం ఉన్న 9-5 ఉద్యోగాలు అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే సంప్రదాయ ఉద్యోగాలు ఉండవని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగులంతా ఒకే దగ్గర ఒకే పని చేయబోరని చెప్పారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు వివిధ రకాల సేవలందిస్తారని హాఫ్ మన్ తెలిపారు. 2034 నాటికి ఇప్పుడున్న జాబ్ ప్యాటర్న్ కనుమరుగవుతుందని వెల్లడించారు. అయితే ఏఐతో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఉంటాయని చెప్పారుయ