20 మంది అభ్యర్థులతో BSP తొలి జాబితా

-

తెలంగాణలో ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ది పనుల గురించి వివరిస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇటీవలే అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ ప్రకటించనున్నట్టు తెలిపాయి. 

నిన్న తెలంగాణలో కూడా జనసేన పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఫస్ట్ లిస్ట్ ని ప్రకటించింది. అందులో 20 మంది అభ్యర్థుల  జాబితాను బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తొలి జాబితాలోనే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేరు ఉండగా.. ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

 

పోటీ చేసే అభ్యర్థుల్లో 11 మంది ఎస్సీలు, ఆరుగురు బీసీలు, ముగ్గురు ఎస్టీలు ఉన్నారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సిర్పూర్,జంగం గోపి జహీరాబాద్, దాసరి ఉషా పెద్దపల్లి, చంద్రశేఖర్ ముదిరాజ్ తాండూరు, మూఢవత్ వెంకటేష్ చౌహన్ దేవరకొండ, కొంకటి శేఖర్ చొప్పదండి, వెంకటేశ్వరరావు యాదవ్ పాల్తేరు, మేడి ప్రియదర్శిని నకిరెకల్, భానోతు రాంబాబు వైరా, నక్క విజయ్ కుమార్ ధర్మపురి, చెన్న రాములు ముదిరాజ్ వనపర్తి, ఎన్.రామచందర్ మానకొండూర్, పి.శ్రీనివాస్ కోదాడ, కొత్తపల్లి కుమార్ నాగర్ కర్నూల్, భన్సిలాల్ రాథోడ్ ఖానాపూర్, ముప్పారపు ప్రకాశ ఆందోల్, వట్టే జానయ్య సూర్యపేట, గడ్డం క్రాంతి కుమార్ వికారాబాద్, పాండ్రయ్యకుమార్ జుక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news