దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటెన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం అని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్‌గా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఈ బడ్టెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల కల్పన, హెచ్‌ఎండీలో మౌలిక వసతులు, మెట్రో వాటర్ వర్క్స్, ఔటర్ రింగ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటివి ఉన్నాయి.
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల కల్పన – రూ.3,065 కోట్లు
హెచ్‌ఎండీఏలో మౌలిక వసతుల కల్పన – రూ.500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ – రూ.3,385 కోట్లు
హైడ్రా సంస్థ – రూ.200 కోట్లు
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ – రూ. 100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు – రూ. 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు – రూ.500 కోట్లు
పాతబస్తీ మెట్రో విస్తరణ – రూ.500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ – రూ.50 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు – రూ.1500 కోట్లు