నల్గొండ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్దమై ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలు వెళితే… నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో కృష్ణ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది.

ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తోంది ఈ కృష్ణ ట్రావెల్స్ బస్సు. ఏసీ డెమో నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.