ఈ నెల 16న జరుగాల్సిన BRS బహిరంగ సభ రద్దు ?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉండే 114 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది BRS పార్టీ. మరో 5 స్థానాలు పెండింగ్ పెట్టింది. మల్కాజ్ గిరి, జనగామ ,నర్సాపూర్ ,నాంపల్లి , గోష మహల్ నియోజకవర్గాల్లో పోటీ లో ఉండే నేతలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది BRS పార్టీ. అటు అసంతృప్త , అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో ఉన్న బిఆర్ఎస్.. కాంగ్రెస్ ,బిజెపి నేతలపై BRS ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తోంది.

brs party

అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొద్ది రోజులుగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను హడావిడిగా చేశారు BRS పార్టీ MLA లు. ఇక అటు ప్రగతి భవన్‌ లోనే ఉంటూ… మేనిఫెస్టో పై కసరత్తు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వరంగల్లో ఈ నెల 16 న బహిరంగ సభ కు ముందు ప్లాన్ చేసిన BRS… మారిన పరిస్థితుల్లో సభ ఉంటుందా ? ఉండదా ? అనే సస్పెన్స్ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సభను రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సభ ఉంటే అక్కడే BRS మ్యానిఫెస్ట్ విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version