కంటోన్మెంట్ బీజేపీ నేత..కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతని చేరికతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన గద్దర్ కూతురు అయోమయంలో పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక అనివార్యం అయింది.
అయితే బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబ సభ్యులే పోటీలోకి దిగితే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలపెట్టకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచే ఎంపిక చేయాలని కాంగ్రెస్ కీలక నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సాయన్న ఫ్యామిలీని కాదని.. ఇతరులను పోటీలో దించితే మాత్రం దివంగత ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న బిడ్డ వెన్నెలనే పోటీలో ఉంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.కానీ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దింతో గద్దర్ కూతురు అయోమయంలో పడింది.