వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డి అరెస్ట్ అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల వం తపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులో ఇరికించారని.. టీడీపీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కాగా లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ సిట్ ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించింది. మిథున్ రెడ్డి నేరం చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి నాన్ క్యాడర్ ఐఏఎస్ గా ప్రమోషన్ ఇస్తామని ప్లాన్ అమలు చేయించారు. A-2 వాసుదేవరెడ్డి, A-3 సత్యప్రసాద్ లను నేరుగా ప్రభావితం చేశారు.